నూతన పంప్ సెట్ ప్రారంభం
— సర్పంచ్ బండి ప్రవీణ్
రామారెడ్డి ఫిబ్రవరి 11 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి గ్రామంలోని 14వ వార్డులో నీటి సమస్య పరిష్కారం కొరకు స్పందించిన పాలకవర్గం, బుధవారం సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన్, వార్డ్ మెంబర్ లు లక్కాకుల శేఖర్, జీరు గారి రాజేందర్,ల ఆధ్వర్యంలో నూతన బోరు మోటర్ ప్రారంభించడం జరిగింది. కాలనీ సభ్యులు బండ్ల రాజు. లక్ష్మణ్,ఒగ్గు ప్రకాష్,ఒగ్గు మల్లేష్, బండ్ల బాలయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది. తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించినందుకు వార్డు సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.
