ప్రత్యర్థుల అబద్ధాలు గుర్తించి బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయండి

Siddipet Bureau
1 Min Read

* బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేయండి

– జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల ఫిబ్రవరి 06(ప్రజాజ్యోతి):జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేర్యాల పట్టణంలో 4,5,6,7,8,9 వార్డుల్లోని ప్రచారంలో భాగంగా  బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మున్సిపల్ కౌన్సిలర్లకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రత్యర్థి పార్టీలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించి ఆలోచించి ఓటు వేయాలని కోరారు.కల్యాణ లక్ష్మి, తులం బంగారం పొందిన వారు కాంగ్రెస్‌కు ఓటు వేయాలనీ, అవి పొందని వారు బీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని వ్యాఖ్యానించారు.మహిళా భృతి రూ.2500 పొందిన మహిళలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, భృతి పొందని మహిళలంతా బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అలాగే చదువుకునే విద్యార్థులకు స్కూటీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అందని మహిళలంతా బీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *