మామడ ఫిబ్రవరి 6 (ప్రజా జ్యోతి)
రోజంతా ప్రకృతి ఒడిలో సేదతీరేలా, అటవీ అందాలు ఆస్వాదించేలా
అటవీశాఖ ఆధ్వర్యంలో మామడ మండలం నల్దుర్తి, పొన్కల్ అటవీ ప్రాంతంలోని రెండు చెరువులను వన దర్శిని కార్యక్రమంలో భాగంగా గురువారం పొన్కల్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు సందర్శించారు

అడవి శాఖ అధికారులు
అక్కడ విద్యార్థులకు అడవి సంరక్షణ ప్రకృతి, పర్యావరణం గురించి అవగాహన కల్పించారు.
అనంతరం క్విజ్, డ్రాయింగ్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలపై కాంపిటీషన్ లను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు.

అనంతరం విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్డిఓ నాగిని భాను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మైస అరవింద్ కుమార్, ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాస్ , సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ తో పాటు ఇతర అడవి అధికారులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉన్నారు
