ప్రజా జ్యోతి 2026 – డైరీ ని ఆవిష్కరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, డిసిసి అధ్యక్షుడు ఆయూబ్..

Warangal Bureau
1 Min Read
  • ప్రజా జ్యోతి పత్రిక 2026 డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాగరాజు, డిసిసి అధ్యక్షుడు ఆయూబ్.

వర్ధన్నపేట, ఫిబ్రవరి 5, ప్రజా జ్యోతి: 

ప్రజా జ్యోతి దినపత్రిక 2026 సంవత్సరం నూతన డైరీ ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు లతో కలసి ఆవిష్కరించారు. గురువారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వర్ధన్నపేట ప్రజా జ్యోతి రిపోర్టర్ మహమ్మద్ రఫీ తో కలిసి ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్షులు తూళ్ల రవి, వర్ధన్నపేట మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, యూత్ అధ్యక్షులు పత్రి భాను ప్రసాద్, పర్వతగిరి మండల అధ్యక్షుడు జాటో శ్రీనివాస్ నాయక్, మాజీ పి ఎస్ సి ఎస్ చైర్మన్ రాజేష్ కన్నా, మహిళ కాంగ్రెస్ నాయకులు నూతన కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *