నేరేడుచర్ల ఫిబ్రవరి 4 (ప్రజా జ్యోతి)నేరేడుచర్ల మున్సిపల్ పీఠం జనరల్ స్థానం కేటాయించడంతో నేరేడుచర్ల లోని 15 వార్డులలో కేవలం మూడు స్థానాలు మాత్రమే జనరల్ కావడంతో గట్టి పోటీ నెలకొంది.ఈ నేపథ్యంలో అధికార పార్టీ చైర్మన్ రేసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుణకం చిన్న వెంకటరెడ్డి ఎన్నికల బరిలో నిలుస్తుండగా ఇప్పటికే ఇంటింటి ప్రచారంతోపాటు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలిసి ఓటును అభ్యర్థిస్తూ ప్రచార పర్వంలో ముందున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటికే పలు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి ప్రదాతగా పేరు పొందిన ఉత్తం సారధ్యంలో చైర్మన్ పీఠం నేరేడుచర్లలో కైవసం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 15వ వార్డు కౌన్సిలర్ గా కొనతం చిన్న వెంకటరెడ్డిని 15వ వార్డులోని అన్ని వర్గాల ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. 15వ వార్డు ప్రజలకు కొనతం చిన వెంకట్ రెడ్డి వ్యక్తిగతంగా, పార్టీపరంగా మంచి సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చైర్మన్ గా అవకాశం కల్పిస్తే 15వ వార్డు సమస్యలు పరిపూర్ణంగా పరిష్కారం అవుతాయి అన్న ఆలోచనల్లో ఓటర్లు ఉన్నారు.
