అభ్యాస స్కూల్ కి రాష్ట్ర స్థాయిలో అవార్డు
వరంగల్ సిటీ, ఫిబ్రవరి 04(ప్రజాజ్యోతి):
సుచరిండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ పేరిట మంగళవారం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి తెలంగాణలోని వరంగల్ జిల్లా శంభునిపేట గణేష్ నగర్ కు చెందిన అభ్యాస స్కూల్ బెస్ట్ స్కూల్ అవార్డ్ కి ఎంపికైంది. అలాగే ఉత్తమ స్కూల్ ప్రిన్సిపాల్ గా మీర్జా అఖిల్ ఉల్లా బేగ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మీర్జా అఖిల్ ఉల్లా బేగ్ కు అవార్డతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అదే విధంగా వారు నిర్వహించిన ఒలింపియాడ్ ఎగ్జామ్ లో రాష్ట్ర స్థాయిలో అభ్యాస స్కూల్ స్టూడెంట్ హిబా ఇరామ్ (7వ తరగతి) తృతీయ స్థానం సాధించారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా లెవెల్ లో అఫ్శాన్ పీర్ దౌషి (5వ తరగతి) ద్వితీయ స్థానం సాధించారు. ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ప్రిన్సిపాల్ మీర్జా అఖిల్ ఉల్లా బెగ్ ని, ఒలింపియాడ్ ఎగ్జామ్ లో అవార్డ్స్ సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మీర్జా నసీరుల్ల బెగ్ అభినందించారు. ఈ సందర్భంగా మీర్జా అఖిల్ ఉల్లా బెగ్ మాట్లాడుతూ ఈ అవార్డ్స్ అభ్యాస స్కూల్ ఫ్యామిలీ టీం వర్క్ ద్వారా చేసిన కృషికి నిదర్శనం అని తెలుపుతూ ఉపాధ్యాయులందరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల శిరీష, రెహమత్ మేడం, కోల రాము, ప్రియాంక, రజినీ, భారతి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
