మోమోస్ కోసం ‘బంగారం’ అమ్మేశాడు: 14 ఏళ్ల బాలుడి వింత నిర్వాకం

V. Sai Krishna Reddy
1 Min Read

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు తనకు ఇష్టమైన ‘మోమోస్’ కోసం ఏకంగా ఇంట్లోని లక్షల విలువైన బంగారు నగలను దొంగిలించాడు. రాంపూర్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ వింత ఉదంతం చోటుచేసుకుంది.

ఈ బాలుడు వీధిలో అమ్మే మోమోస్‌కు ఎంతగా బానిసయ్యాడంటే.. వాటిని కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఒక్కో నగను దొంగిలించడం మొదలుపెట్టాడు. ఆ నగలను నేరుగా వెళ్లి ఒక మోమోస్ బండి యజమానికి ఇచ్చేవాడు. నగలకు బదులుగా ఆ యజమాని బాలుడికి రోజూ మోమోస్ ఇచ్చి పంపేవాడు.                               .బాలుడి అత్త తన నగల కోసం బీరువా తెరవగా, అందులో ఉండాల్సిన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించింది. కుటుంబ సభ్యులు నిలదీయగా.. బాలుడు అసలు విషయం చెప్పాడు. తాను చేసిన దొంగతనం, వాటిని మోమోస్ బండి వ్యక్తికి ఇచ్చిన వైనం విని అందరూ అవాక్కయ్యారు.

బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మోమోస్ వ్యాపారిని గుర్తించి, దొంగిలించిన నగలను రికవరీ చేసే పనిలో పడ్డారు. బాలుడు అమాయకంగా ఆ పని చేసినా, అది చట్టరీత్యా నేరం కావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *