
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ పోచంపాడ్ బి ఆర్ ఎస్ నాయకులు మెండోరా మండల నేతలు పోచంపాడ్ NH 47 రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ , ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో ర్యాలీగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ……… కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వానికే అవమానమన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తోందని నేతలు ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ రానున్నది బీఆర్ఎస్ పార్టీ స్వర్ణ యుగమే అన్నారు. మోసపూరిత హామీలతో గదినెక్కిన కాంగ్రెస్ అడుగడుగునా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని అన్నారు.
ఇకనైనా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పై కేసులపై దృష్టి పెట్టకుండా ప్రజలపై,రైతులపై దృష్టి పెట్టాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ,
శేఖర్ రెడ్డి దూద్ గావ్ సర్పంచ్ బాబా. పోచంపాడు సర్పంచ్ కే.రాజు. మరియు మాజీ సర్పంచ్ మిస్బా బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా జ్యోతి రిపోర్టర్ ( ఎలిగేటి వంశీ కృష్ణ నేత)
