
చేర్యాల జనవరి30(ప్రజాజ్యోతి): రెండవ సాధారణ ఎన్నికల్లో చేర్యాల మున్సిపాలిటీలో మొదటిరోజు ఐదు నామినేషన్ రాగా రెండవ రోజున 21 నామినేషన్లు,చివరి రోజు 59 నామినేషన్లు దాఖలు అయ్యాయి.శుక్రవారం రోజు మొత్తం 12 వార్డులకు గాను ఒకటో వార్డులో ఆరు, రెండో వార్డ్ లో నాలుగు, మూడో వార్డులో ఏడు, నాలుగో వార్డులో ఐదు, ఐదో వార్డులో ఐదు, ఆరో వార్డులో ఐదు, ఏడవ వార్డులో నాలుగు, 8వ వార్డులో ఏడు, తొమ్మిదో వార్డులో నాలుగు, పదో వార్డులో నాలుగు, 11వ వార్డులో ఆరు, 12వ వార్డులో రెండు ఇలా మొత్తం 59 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు వరకు మొత్తం కలిపి 85 నామినేషన్లు దాఖలయ్యాయని చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. వారి వెంట మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
