గూడెప్పాడు లోని ‘ఎంఎం మార్ట్’ నందు 40 కిలోల నకిలీ టీ పౌడర్ సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. 

Warangal Bureau
1 Min Read
  • ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నకిలీ టీ-పౌడర్ సీజ్

  • గూడెప్పాడు లోని ఎంఎం మార్ట్ నందు 40 కిలోల నకిలీ టీ పౌడర్ సీజ్

ఆత్మకూరు, జనవరి 30 (ప్రజాజ్యోతి):

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని పలు హోల్ సేల్ కిరాణా షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గూడెప్పాడు సర్కిల్ లో జాతీయ రహదారిపై గల ఎంఎం మార్ట్ నందు 40 కిలోల నకిలీ టీ పౌడర్ సీజ్ చేశారు. ఈ సందర్బంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నకిలీ టీ-పౌడర్ ను ఎలా గుర్తించాలో వినోయోగదారులకు తెలియచేసారు. వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు పోలీసు వారు తనిఖీలు చేసి, దాదాపు 40 కిలోల నకిలీ టీ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి మరియు మౌనిక నకిలీ టీ పౌడర్ ను ఎలా గుర్తించాలో డెమో చేసి చూపించినారు. హెయిర్ డై కలిపిన నకిలీ టీ-పౌడర్ ను (జుట్టు కు వేసే రంగు) తో తయారు చేస్తున్నారు. ఇట్టి రసాయనాలు వాడడం వలన ప్రజలకు క్యాన్సర్ వ్యాధి మరియు ఇతర వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలు నకిలీ ఇలాంటి టీ పౌడర్ లను వాడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల రూరల్ సీ.ఐ. రంజిత్ రావు, శాయంపేట ఎస్సై పరమేశ్వర్, దామెర ఎస్సై కొంక అశోక్ పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *