డబ్బు, మద్యం రహిత ఎన్నికలు నిర్వహించుకుందాం.

Siddipet Bureau
0 Min Read

చేర్యాల మున్సిపల్ ఎన్నికలు….డబ్బు, మద్యం రహిత ఎన్నికలు నిర్వహించుకుందాం.

చేర్యాల జనవరి 29(ప్రజాజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా నీతి, నిజాయితీ, నిబద్ధత గల నాయకునికి పట్టం కట్టాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ తెలిపారు.ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ..జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ద్వారా డబ్బు, మద్యానికి ప్రభావితం కాకుండా,ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకున్ని ఎన్నుకోవాలని అన్నారు.ఎన్నికల్లో ఆర్థికపరమైనటువంటి తప్పిదాలు జరగకుండా ఎన్నికల నిర్వహణ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *