‘స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌’పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు మానుకోవాలి..

Warangal Bureau
2 Min Read
  • ‘స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌’పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు – నమ్మవద్దని సూచన

  • – సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైసర్ ఆవునూరి కుమారస్వామి

వరంగల్ సిటీ, జనవరి 29(ప్రజాజ్యోతి):

ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని ఆన్లైన్ పత్రికలలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీపై కొన్ని అసత్య, ఆధారరహిత ప్రచారాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా క్లెయిమ్స్ తిరస్కరణలు, సేవల లోపం అంటూ వాస్తవానికి భిన్నమైన సమాచారం వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు, పాలసీ దారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కు చెందిన సీనియర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైసర్ ఆవునూరి కుమారస్వామి సూచిస్తున్నారు. కంపెనీపై వస్తున్న దుష్ప్రచారాలపై గురువారం మీడియా ముఖంగా వారు మాట్లాడుతూ ‘స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్’ దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య భద్రతను అందిస్తున్న ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) నియమావళి ప్రకారం పని చేస్తున్న స్టార్ హెల్త్ సంస్థ, క్లెయిమ్ సెటిల్మెంట్‌లో పారదర్శకతను పాటిస్తూ, కస్టమర్లకు నిరంతర సేవలు అందిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి అతిపెద్ద స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘స్టార్ హెల్త్’ అని, 20సం. లుగా కోట్లాది భారతీయుల నమ్మకాన్ని చూరగొని.. దేశవ్యాప్తంగా 14,000లకు పైగా నెట్వర్క్ హాస్పిటల్స్, 15,500పైగా ఉద్యోగులు, 950 బ్రాంచి ఆఫీసులు, 8లక్షలకు పైగా ఏజెంట్లు కలిగి ఇప్పటి వరకు 62,500కోట్ల రూపాయల క్లెయిమ్స్ సెటిల్ చేసిందని, 1కోటి 50లక్షల క్లెయిమ్స్ సెటిల్ చేసి పాలసీ దారుల నమ్మకాన్ని నిలబెట్టిన సంస్థ అని అన్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను అన్వయించుకుంటూ పాలసీ దారులకు మెరుగైన సేవలు అందించడంలో స్టార్ హెల్త్ ముందువరుసలో నిలబడుతుంది. కావున సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారం నిజమే అన్న భావనతో ప్రజలు, కస్టమర్లు మోసపోవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా కంపెనీ అధికారిక వెబ్‌సైట్, కస్టమర్ కేర్ లేదా అధికారిక ఏజెంట్ల ద్వారా స్పష్టత పొందాలని తెలిపారు. కొన్నిరకాల ఆన్లైన్ పత్రికలు, యూట్యూబ్ చానెళ్లు వ్యూస్ కోసం, పెద్ద కంపెనీపై ఆరోపణలు చేస్తే తొందరగా ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని నిజానిజాలు తెలుసుకోకుండా, ఒక వైపే చూసి అదే నిజం అనుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇట్టి అసత్య ప్రచారాల వల్ల పాలసీ దారుల్లో అనవసర భయం ఏర్పడుతుందని, ఇది ఇన్సూరెన్స్ లాంటి కీలక రంగంపై తప్పు అభిప్రాయాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. అందుకే వాస్తవాలను తెలుసుకుని, నమ్మదగిన వనరుల నుంచే సమాచారం స్వీకరించాలని అన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థలపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని, సోషల్ మీడియా వినియోగంలో వ్యక్తులు కానీ, సంస్థలు కానీ బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *