ఎంఎస్ఎన్ కంపెనీకి జేఏసీ సవతి ప్రేమ ఎందుకో..?

Kamareddy
3 Min Read

ఎంఎస్ఎన్ కంపెనీకి జేఏసీ సవతి ప్రేమ ఎందుకో..?జియో

— ఎమ్మెస్ ఎన్ కంపెనీ కొరకు ఉద్యమిస్తున్న కంచర్ల ఉద్యమకారుడు

— ప్రజాభిప్రాయం 15 రోజులు ఆగాలి అన్నారు

–మండల ప్రజల సమక్షంలో సమావేశం

శూన్యమ..?

–ఎంఎస్ఎన్ కంపెనీకి జేఏసీకి సయోధ్య ఎందుకో?

–ప్రశ్నించినందుకే గ్రూపు నుండి రిమూవ్ చేయడం వెనక రహస్యం ఏమిటి?

–థాయిలాలు అందుతున్నట్లు సమాచారం

— కంచర్ల గ్రామానికి చెందిన గొల్ల మహేందర్ యాదవ్ ఆవేదన

 

బిక్కనూర్ జనవరి 26 (ప్రజాజ్యోతి) 

బిక్నూర్ మండలంలోని 18 గ్రామాల ప్రజలలు యాసప్రాయాసాలకు కట్టుబడి ప్రజాభిప్రాయం కోసం ఏకతాటిపై ప్రశాంతత బంధును విజయవంతం చేయడం జరిగింది. ఇంతవరకు సమంజసమే అయితే ఈ మధ్యకాలంలో కొందరు ఆ కంపెనీకి తొత్తులుగా మారారని ఈ యొక్క ఐక్యతను చెల్లాచెదరం చేసేందుకు కంపెనీ యాజమాన్యం కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఇదే జరిగితే గతంలో ఎంఎస్ఎన్ కంపెనీ గత 15 సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు కంపెనీ వద్దు ఈ బాధలు మాకు వద్దు అని సుమారు 108 రోజులు ధర్నా కార్యక్రమాలు చేస్తే కూడా పట్టింపు లేకుండా ఆ యొక్క కంపెనీ గత ప్రభుత్వ అనుమతులతో 100 ఎకరాలు కొనుగోలు చేసి తదుపరి ప్రభుత్వ భూమి 15 ఎకరాలు సుమారు ప్రస్తుతం 300 ఎకరాలతో భారీ పెద్ద పెట్టుబడులతో నిర్మించబడిన ఆ ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యక్తపదార్థాలు అంతా ఇంతా కాదు రోజురోజుకు ప్రజలప్రాణాలను గుప్పెట్లో పెట్టుకునే విధంగా ప్రాణాలతో చెలగాటం ఆరోగ్యం అరచేతిలో, వైద్య రంగానికి అంతుచిక్కని రోగాలు 60 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తులు 40 సంవత్సరాలకే కాలం చెల్లితున్నారు. ఇలాంటి వాతావరణ కాలుష్యం వలన మండల కేంద్రం మొత్తం రాను రాను గత కొన్ని రోజులలో నిర్మానుషం అయ్యే అవకాశం కూడా లేదు లేకపోలేదు.

ఓ వ్యక్తి జెఎసి కమిటీకి ఫోన్ చేస్తే..!

ఇంత నిర్లక్ష్యమా..? సహకరించాల్సింది పోయి సమస్యకు గాని ప్రశ్నకు గాని జవాబు చెప్పాల్సింది పోయి ఏకంగా విమర్శించడం కంచర్ల గ్రామానికి గొల్ల మహేందర్ యాదవ్ వ్యక్తికి జరిగిన ఘటన అతను మాటల్లో ఓ వ్యక్తి తో సంభాషణ అన్న నాది చిన్న విన్నపం ఒక విశ్లేషణ అన్న ఇప్పుడు మనం చేసే పోరాటం ఫ్యూజన్ గురించి అదే అప్పుడు ఎంఎస్ఎన్ స్టార్ట్ అవుతున్నప్పుడు చేస్తే బాగుంటుండే అన్న అందరం కలిసి అప్పుడు ఎమ్మెస్ అండ్ కంపెనీ నుంచి పెద్ద నాయకులకు ఎవరెవరికి ముడుపులు చెందాయి వచ్చాయి ఇప్పుడు వారు బయటకు వస్తలేరు ఇప్పుడు కొంతమంది చేసే పోరాటం మనలో ఎంఎస్ఎన్ ముద్దు ఫ్యూజన్ వద్దు అన్న టైపులో చేస్తున్నామన్న మనం మరి ఎంఎస్ఎన్ గురించి ఎవరూ మాట్లాడలేదు దాని టాపిక్ లేదు ఎందు గురించి అని అడగగా వారు వారి ఇష్టానుసారంగా క్యూస్షన్ రేట్ చేయడం నీకు అవసరమా అని వ్యక్తిని దూషించిన విధంగా గ్రూప్ నుండి రిమూవ్ చేయడం వెనక ఏమిటి. కంపెనీ యాజమానికి ఏదైనా సత్సంబంధాలు ఉన్నాయా అనే రీతిలో ప్రజలు వాపోతున్నారు అని విమర్శలు వినిపిస్తున్నాయి.ఎంఎస్ఎన్ కంపెనీ స్థాపించి సుమారు 15 సంవత్సరాలు అయితుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని ప్రాణాలు పోయినాయో అంతుపట్టని ఆలోచన ఆ రోజుల్లో గుర్తించని భిక్కనూరు గ్రామ ప్రజలు ఇకనైనా చైతన్య వంతులై ఎమ్మెస్ కంపెనీ మూతపడడం పక్కా ఖాయం మండల ప్రజలంతా ఏకతాటిపై ఉన్నారు కంపెనీ యా లేదా లాక్ అవుట.. అనే నినాదంతో ఐక్యంగా బలపడుతున్నారని డిమాండ్ చేస్తున్నారు. ఇదే కొనసాగితే గతంలో నిర్మించిన ఎమ్మెస్ అండ్ కంపెనీ, ప్రభుత్వ అనుమతులు కోరిన ఫిజియన్ కంపెనీ మూతపడే అవకాశాలు మరికొద్ది రోజులలో ఉన్నాయి. ఇదే జరుగుతే మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో బాగుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తీగలాగితే డొంక కదిలినట్లుగా కంపెనీకి తొత్తులుగా ఉన్న వారిలో గుండెలు గుబ్బేలుమన్న రీతిలో భయభ్రాంతులు పుంజుకున్నట్లు స్థానికుల సమాచారం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *