మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Bharath Goud
1 Min Read
  • జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి, సమాజంలో గౌరవంగా బతకాలన్నదే ఇందిరమ్మ రాజ్యం సంకల్పమని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన “ఇందిరా మహిళా శక్తి సంబురాలు” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ లతో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

•మహిళ సంఘాలకు పెద్దపీట

సభలో మంత్రి మాట్లాడుతూ.. మహిళా శక్తిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. “మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మహిళా సాధికారతకు బాటలు వేశారు. అదే స్ఫూర్తితో నేడు ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..  ర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి, మహిళల సంక్షేమానికి ప్రతి పథకం అర్హులకు చేరేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియ మహిళలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *