నర్సాపూర్ (ప్రజాజ్యోతి) పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బి సబ్ డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో (నేడు) గురువారం ఉదయం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక వీధి కుక్క కార్యాలయ ప్రహరీ గోడ గేటు గుండా అవతలి వైపు వెళ్లే క్రమంలో, దాని తల గేటు ఊచల మధ్య ఇరుక్కుపోయింది. అది బయటకు రాలేక కుక్క పెడుతున్న కేకలను గమనించిన స్థానికులు ఆ మూగజీవిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో దాదాపు 30 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించారు. మొదట కుక్క తలను మెల్లగా బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ స్థానికులు సైతం విఫలమయ్యామని నిరాశ చెందారు. పట్టుదలతో మరిన్ని మార్లు ఉపాయంతో ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆ గేటు ఊచల మధ్య నుండి శునకం తలను సురక్షితంగా బయటకు తీశారు. విముక్తి పొందిన ఆ శునకం అక్కడి నుండి పరుగులు తీయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
