రామారెడ్డి లో గ్రామ సింహాల స్వైర విహారం
— 13 మంది కి గాయాలు
— ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు

సంక్రాంతి సంబరాలు ప్రభుత్వం కేటాయించిన సెలవులు సంతోషంగా ఆనందంగా గడపాల్సిన పిల్లలు, పెద్దలు పండగ వాతావరణం ఆనందించే వేళ రామారెడ్డి గ్రామంలో కుక్కల బెడద రోజురోజుకు ప్రజలను ఇబ్బందులను గురిచేస్తున్నాయి. వాహనదారులను రాత్రివేళ వెంబడించడం, వాహనాలు అదుపుతప్పి కింద పడటం, శతకాత్రులుగా మారడం అదేవిధంగా గురువారం రాత్రి 3 వ్యక్తులను ఓ పిచ్చికుక్క గాయపరచడం జరిగింది అదేవిధంగా గురువారం ఉదయం 13 మందికి అదే కుక్క మరోసారి విజృంభించి ప్రజలపై దాడి చేసి గాయపరచడం జరిగింది. ఇదే కుక్క గ్రామంలో తిరుగుతూ ఉందని స్థానికులు తెలుపుతున్నారు. బాధితులు హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పండగ పూట ఈ కుక్కల బెడదను నివారించే మార్గాన్ని గ్రామ పాలకవర్గం తక్షణమే స్పందించి కుక్కల బెడదను నివారించాలని గ్రామ ప్రజలు భయాందోళనతో ఈ యొక్క గ్రామ సింహాలపై ఖచ్చితమైన నివారణ చర్యలు తీసుకోవాలని కోరుకున్నా గ్రామ ప్రజలు.
