కామారెడ్డి మండల సర్పంచులను ఘనంగా సన్మాన కార్యక్రమం
సన్మానించిన కామారెడ్డి ఎంపీడీవో ఎఫ్ సి బా రాణి
కామారెడ్డి రూరల్ జనవరి 7 ప్రజా జ్యోతి
కామారెడ్డి మండలంలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సర్పంచ్లను కామారెడ్డి మండల ఎంపీడీవో ఎఫ్ సి బా రాణి ఘనంగా సన్మానించారు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల సేవలను కొనియాడుతూ గ్రామాలలో అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంపీడీవో రాణి మాట్లాడుతూ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గ్రామ వాసుకి అందెల సర్పంచులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు గ్రామాలలో పరిశుద్ధ తాగునీరు రహదారులు విద్య ఆరోగ్య రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైనంత ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార దిశగా సర్పంచ్లు చెబుతున్న చొరవ అభినందనీయమని తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు సర్పంచులను మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి గౌరవించడం సంతోషంగా ఉందని భవిష్యత్తులో మరింత బాధ్యత గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ప్రభుత్వ అధికారుల సహకారంతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు ఉపసర్పంచ్లు వార్డు సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు
