- ఏడీఏ సంధ్యారాణి తనిఖీ
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మండలంలో రైతులకు సరిపడ యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని , ఎరువుల కొరత లేదని సహాయ వ్యవసాయ సంచాలకులు సంధ్యారాణి స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారిని దీపికతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని యూరియా నిల్వలను, విక్రయాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందకుండా తమ పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డులను చూసి సాగు భూమికి తగినంత ఎరవడం తీసుకోవాలని సూచించారు. డీలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని, ఎకరానికి మూడు బ్యాగుల చొప్పున మాత్రమే జరపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.
