భారత మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నాడు. నిన్న రాత్రి నగరానికి చేరుకున్న ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు నోవాటెల్‌లో జరగనున్న ‘బిగ్ అకాడమీ’ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి యువరాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ ఇచ్చే ఈ అకాడమీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవంలో భాగంగానే యువరాజ్ నగరానికి వచ్చాడు.
