చివ్వెంల జనవరి 05(ప్రజా జ్యోతి):చివ్వెంల మండలం ఐలాపురం గ్రామం ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతీయ రోడ్డు భద్రత మహాసయోత్సవాల్లో భాగంగా రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు.పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్సై వి.మహేశ్వర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అధిక వేగం,మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు.వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్ వినియోగించడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.పాదచారులు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో చివ్వెంల మండల పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు,హోంగార్డులు, గ్రామస్థులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
