జపాన్‌లో భూకంపం… కొత్త సంవత్సరాది వేళ కలవరం

V. Sai Krishna Reddy
1 Min Read

నూతన సంవత్సరం వేళ జపాన్‌లో భూకంపం సంభవించింది. తూర్పు నోడా నగరంలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించింది. నోడాకు తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో, 19.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ నెల 8వ తేదీన జపాన్ తూర్పు తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం విదితమే. ఆ సమయంలో పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం డిసెంబర్ 12న 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *