వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకున్న ఉపసర్పంచ్
రాజంపేట డిసెంబర్ 31 (ప్రజాజ్యోతి)
రాజంపేట మండలం పొందుర్తి గ్రామ ఉపసర్పంచ్ బిక్కి సౌజన్య తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో బాలకృష్ణకు అందజేశారు. వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. ఈ విషయంపై ఎంపీడీవో బాలకృష్ణ స్పందిస్తూ, సౌజన్య రాజీనామా పత్రం అందిన విషయం నిజమేనని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
