మామడ డిసెంబర్ 31 (ప్రజా జ్యోతి)
మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలోని శ్రీ గోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
భక్తులకు ఆలయంలో దర్శనానికి ప్రవేశం కోసం ఉత్తర దిశ నుంచి ఆలయంలో కి ప్రవేశించడానికి ఏర్పాట్లను చేశారు.

ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్న స్వామి

మంగళ హారతులతో మాత లు

భక్తులకు ప్రసాదం అందచేస్తున్న నిర్వాకులు

హనుమాన్ మందిరం లో పూజలు నిర్వహిస్తున్న స్వాములు
హనుమాన్ స్వాములు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తిశ్రద్ధలతో శ్రీ వీర హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించారు.
హనుమాన్ మందిర ప్రాంగణమంతా శ్రీ రామనామస్మరణతో మార్మోగింది.
అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకం, సింధూర అలంకరణ హనుమాన్ చాలీసా ,దండకం, శ్రీ ఆంజనేయ స్వామి శతనామావళి పూజారి కార్యక్రమాలు నిర్వహించారు.
రేపు అనగా 31 డిసెంబర్ బుధవారము రోజున హనుమాన్ మాల స్వీకరించిన స్వాములు మాల విరమణ కొరకు కొండగట్టు బయలుదేరుతున్నట్లు తెలియజేశారు, శ్రీ హనుమాన్ దీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో సన్నిధానం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురు స్వామి గంగన్న పేర్కొన్నారు.
