నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యలాపాలతో బిజీగా ఉండే టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తమ పొలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. తమ స్వగ్రామం వెంకటాపురంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె సందర్శించారు. ఉదయం చలిలో పొలంలోకి వెళ్లిన ఆమె… అప్పటికే అక్కడ పనుల్లో నిమగ్నమైన కూలీలతో మమేకమయ్యారు. అక్కడ సాగు చేస్తున్న వివిధ పంటలను పరిశీలించారు. పొలంలో ఉన్న మిరపకాయలను కోశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వ్యవసాయంలో ఉండే సంతృప్తి మరెక్కడా ఉండదని చెప్పారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మరోవైపు, పరిటాల సునీత వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
