తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ రాజకీయాల్లో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచులకు ఇప్పటివరకు ఉన్న ‘జాయింట్ చెక్ పవర్’ను
పూర్తిగా రద్దు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం గ్రామ స్థాయి రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడిప్పుడే ఎన్నికై, తమ పదవిలో చక్రం తిప్పాలని ఆశపడిన వేలాది మంది ఉప సర్పంచులకు ఈ నిర్ణయం గట్టి ఎదురుదెబ్బగా మారింది. గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో ఉప సర్పంచులకు ఉన్న జాయింట్ చెక్ పవర్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
