సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20(ప్రజాజ్యోతి):స్థానిక సూర్యాపేట పట్టణ కేంద్రం 4వ వార్డు,ఖాసీంపేట నందు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా ఆధ్వర్యంలో బేతెస్థ మినిస్ట్రీస్ చర్చి లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినారు, కేక్ కట్ చేసి స్విట్స్ పంచిపెట్టినారు, పిల్లలు డాన్స్ లు,పాటలతో అలరించారు.ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధులుగా పాస్టర్ సి. హెచ్ డేవిడ్ బాపట్ల పాల్గొని క్రీస్తూ పుట్టిక గురించి ప్రసంగించారు.ఈ కార్యక్రమం లో పాస్టర్ యం రూబెన్,పాస్టర్ మామిడి క్రీస్థోఫర్, యేసుపాదం,మీసాల తీతు,రామకృష్ణ, వెంకన్న,జాకర్య తదితరులు పాల్గొన్నారు.
