మొట్టమొదటి మున్నూరు కాపు సర్పంచ్
— బండి ప్రవీణ్ కుమార్
రామారెడ్డి డిసెంబర్ 12 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలోని రామారెడ్డి గ్రామ సర్పంచ్ మున్నూరు కాపు అభ్యర్థి బండి ప్రవీణ్ కుమార్ నూతనంగా రికార్డ్ సృష్టించడం జరిగింది. రామారెడ్డి గ్రామ పంచాయతీ ఏర్పడిన నుండి ఇప్పటి వరకు ఎవరు కూడా సర్పంచ్ ఎన్నిక కాలేదు, ప్రస్తుతం బండి ప్రవీణ్ నూతన సర్పంచ్ గా ఎన్నికవ్వడం జరిగింది.రామారెడ్డి చరిత్ర లో ఒక కొత్త మార్పులు తీసుకొచ్చి మొదటిసారి మున్నూరు కాపు అభ్యర్థిగా గెలుపొంది ఈ గెలుపు సంబంధించి సపోర్ట్ చేసిన పుట్టిన కులానికి రుణం తీర్చుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడిగా పనిచేస్తూ, స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కృషితో, పాటు ప్రజలలో మంచి పేరున్న నాయకుడిగా, ప్రజలలో మంచి చెడులకు నేను ముందున్నాను అని ప్రజాసేవకు చాలా సంవత్సరాలుగా సేవ చేస్తూ గ్రామాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తానని సహాయ సహకారాలు అందించిన ఘనత. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి సహకరించిన వారికి అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈయొక్క ఎన్నికలలో బండి ప్రవీణ్ కు అవకాశం ఇచ్చి సుమారు 391 ఓట్ల మెజార్టీతో గెలిపించి తన వెన్ను తట్టి ముందున్న నాయకులకు,స్నేహితులకు యువతకు, ప్రజలందరికీ పేరుపేరునా ఈ సువర్ణ అవకాశం ఇచ్చినటువంటి రామారెడ్డి గ్రామ ప్రజలందరికీ సేవ చేసే అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
