పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

* స్థానిక ఎన్నికలపై పీఓలు, ఎపీవోలకు శిక్షణ కార్యక్రమం :ఆర్డీఓ పార్థసింహరెడ్డి
ఎల్లారెడ్డి, డిసెంబర్- 9 (ప్రజా జ్యోతి )
గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిశ్శబ్దతతో నిర్వహించడం ప్రతి ఎన్నికల సిబ్బంది బాధ్యత అని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహారెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవుల ఫంక్షన్ హాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో తప్పిదాలకు తావు లేకుండా ముందస్తు ప్రాణాలికతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు విధుల్లో నిస్పక్షికత, టాలెంట్ బాక్సులు నిర్వహణ బ్యాలెన్స్ ఓటింగ్ పద్ధతులపై పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ ఎలాంటి అంతరాయం లేకుండా ఎన్నికలు విజయవంతం నిర్వహించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది తమ పాత్ర ఎంత ముఖ్యమో గ్రహించి శిక్షణలో నేర్చుకున్న ప్రతి దాన్ని ప్రాక్టికల్ గా అమలు చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్స్ కేంద్రాల దగ్గర ఎన్నికల సమగ్రత తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ బాక్సులు బ్యాలెన్స్ పేపర్లు ఇతర ఎన్నికల సామాగ్రిగా ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని అన్నారు. అనంతరం ఎంపీడీవో తహేర బేగం మాట్లాడుతూ… గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని పిఓలు బ్యాలెన్స్ బాక్సులు బ్యాలెన్స్ పేపర్లు సరిగా ఉన్నాయా ఏవైనా చినిగి ఉన్నాయా, సీరియల్ నంబర్ను సరిగా ఉన్నాయా లేవా చూసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుందని కనుక పిఓలు వెంటనే బ్యాలెన్స్ బాక్స్ను సరిగ్గా సీల్ చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందించాలని పేర్కొన్నారు. అదేరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ముఖ్య గానే గెలిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాలు జారీచేసి అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఆమె తెలిపారు. మాస్టర్ ట్రైనర్ లు దేవేందర్, శ్రీనివాసులు పీఓ,ఎపివోలకు పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు ఓటములకు ఒక ఓటు కూడా చాలా ముఖ్యంగా పరిగణిస్తారు, కాబట్టి పిఓలు అత్యంత జాగ్రత్తగా పారదర్శకంగా ఎన్నికల నియమాలని పాటిస్తూ ఎటువంటి తప్పులు దొరలకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తహేరా బేగం, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, ఎంఈఓ రాజులు,ఎంపీఓ ప్రకాష్, మాస్టర్ ట్రైనర్ లు దేవేందర్, శ్రీనివాస్, పిఓలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.
