- భార్య కాపురానికి రావడం లేదని యువకుడి ఆత్మహత్య
ఆత్మకూరు / ప్రజాజ్యోతి::
భార్య కాపురానికి రావడం లేదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం మల్కపేటలో చోటు చేసుకుంది. ఆత్మకూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిప్పని రమేష్(42) ఎంజీఎం ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఇంట్లో మనస్పర్థలు రావడంతో భర్తతో గొడవ జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో రమేష్ మనస్తాపం చెందారు. మంగళవారం రాత్రి పురుగుల మందుతాగి మృతి చెందారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

