దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
పరిగి, నవంబర్ 26 (ప్రజాజ్యోతి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకమైన అధ్యాయంగా నిలిచిన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైన రోజును పురస్కరించుకొని ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు.
స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ — తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షే రాష్ట్ర సాధనకు మలుపుతిప్పిన మహోద్యమ క్షణమని పేర్కొన్నారు. దీక్షా దివాస్ కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలోని త్యాగాలు, ఉద్యమ స్పూర్తిని స్మరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
