- పెద్దాపూర్ సొసైటీలో నిధుల దుర్వినియోగం – కార్యదర్శి సస్పెండ్
దామెర, నవంబర్ 26 (ప్రజాజ్యోతి):
పెద్దాపూర్ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సీఈవో శ్రీనివాస్ ను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దాపూర్ వ్యవసాయ సహకార సంఘంలో అధికారిక విధుల పట్ల నిర్లక్ష్యం, మరియు ఎరువుల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా తన వద్దనే ఉంచుకోవడం వల్ల క్రమశిక్షణ చర్యలో భాగంగా విధుల నుండి తొలగించినట్లు సంజీవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి పి సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన వరి ధాన్య సేకరణ, రైతు ఉత్పత్తిదారుల సంఘాలలో వాటాదనం, కొత్త సభ్యులను చేర్చడం, రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, ఉత్పత్తులకు సరైన ధర, కామన్ సర్వీస్ సెంటర్స్ మరియు రైతు వికాస కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పెంచికలపేట కార్యదర్శి లక్ష్మయ్య కు ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు.

