మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారని కేసు నమోదు
— బిఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు
రామారెడ్డి నవంబర్ 20 (ప్రజా జ్యోతి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా,స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.ధనసరి అనసూయ (సీతక్క) ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలకు పాల్గొనేందుకు జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి సీతక్క కాన్వాయ్ ను రామారెడ్డి మండల కేంద్రంలోని పిఎసిఎస్ వరి కొనుగోలు కేంద్రం వద్ద, కొందరు బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పలు రకాల సమస్యలపై మంత్రి సీతక్కకు వినతి పత్రం ఇవ్వడానికి కాన్వాయను అడ్డుకున్నారు.ఇదే క్రమంలో మంత్రి సీతక్క వారికి సమాధానం ఇస్తూ అదేవిధంగా అక్కడే ఉన్న రైతులకు సన్న రకానికి బోనస్ కూడా అందజేయడం జరుగుతుందని, ఏదైనా సమస్య ఉన్నట్లయితే సమయం చూసుకొని మీ యొక్క సమస్యలను విన్నవించాలని అక్కడి నుండి వెళ్ళిపోయారు. తదుపరి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకల్ గ్రామంలో మాలవత్ పూర్ణ తండ్రి కాలం చేసినందున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి బయలు దేవతున్న కాన్వాయ్ ను కొందరు బిఆర్ఎస్ నాయకులు రైతుల ముసుగులో కావాలని మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారని కొంతమంది బిఆర్ఎస్ కార్యకర్తలు అకస్మాత్తుగా వచ్చి అడ్డుకున్నారన్న కారణంగా మంత్రి సీతక్కకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని డ్యూటీలో ఉన్న సంబంధిత పోలీసు అధికారి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు, కాన్వాయ్‌ను అడ్డుకున్న కొందరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగల శ్రీనివాస్ గుప్తా, నారెడ్డి దశరథ్ రెడ్డి మాజీ ఎంపీపీ, కొత్తొల్ల గంగారం ఉప్పలవాయి మాజీ సర్పంచ్,బాలదేవ్ అంజయ్య రామారెడ్డి, లేగల ల్యాగల మహిపాల్ రామారెడ్డి, హన్మయల్లా రాజయ్య రామారెడ్డి, వీరిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై బి. రాజశేఖర్ తెలిపారు.
