పంట పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం…
పర్వతగిరి, నవంబర్ 13 (ప్రజాజ్యోతి)::
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొండపాక గ్రామ శివారులోని కొంకపాక గ్రామానికి చెందిన గద్దల రాములు వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని సుమారు 65 వయస్సు గల వ్యక్తి ఒంటిపై లేత గులాబీ రంగు లుంగీ, నీలి రంగు చొక్కా గల మృతదేహం లభ్యం అయినట్లు ఎస్సై ప్రవీణ్ పేరొన్నారు. రాములు తన వ్యవసాయ పొలం పనులకు వెళ్లగా దుర్వాసనలు రావడంతో పరిశీలించగా మృతదేహం ఉన్నట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పేరొన్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, పూర్తి వివరాలుకు పర్వతగిరిఎస్సై ఫోన్ నెంబర్ 87126 85242తో పాటు పోలీస్ స్టేషన్ నెంబర్ 8712685028 లకు సంప్రదించాలన్నారు.
