మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్ల నవంబర్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం చేవెళ్ల సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డితో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం క్వింటాల్ కు రూ.2400 కనీస మద్దతు ధర కల్పిస్తుందన్నారు. దళారుల నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు.
కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు మెంబర్, మార్కెట్ కమిటీ చైర్మన్, సొసైటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, మాజీ ఉప సర్పంచులు, నాయకులు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
