కుక్క నోట్లో మృత శిశువు… మిర్యాలగూడ లో కలకలం
మిర్యాలగూడ, నవంబర్ 10,( ప్రజాజ్యోతి ): నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.నెలలు నిండని శిశువు మృతదేహం కుక్కనోట్లో కనపడి కలకలం రేపింది. పట్టణంలోని విద్యానగర్ కు వెళ్లే సబ్ జైల్ రోడ్ లో కుక్క శిశువు మృతదేహాన్ని నోట కరుచుకొని వెళ్తుండడంతో స్థానికులు గుర్తించి వెంటనే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.శిశువు మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికితరలించారు.ఆడ శిశువు కావడంతోనే అబార్షన్ చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
