- మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరిక
 - వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి..
 - అధికారులు, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
 
పర్వతగిరి, అక్టోబర్ 29 (ప్రజాజ్యోతి)::
నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సూచించారు. విద్యుత్,త్రాగునీరు, అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్లు,చెరువులు మరియు కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే శిథిలావస్థ ఇళ్ళు,భవనాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి చూసించారు. అవసరం అయితే వారిని పునరావస్థ కేంద్రాలు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలు కూడా భారీ వర్షాల వలన అప్రమత్తంగా ఉండాలని అవసరం అయితే పోలీసులకు , అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అధికార యంత్రంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళరాదని ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎదైనా ఇబ్బందులు ఉంటే నా డయల్ యువర్ ఎమ్మెల్యే టోల్ ఫ్రీ నెంబర్ 8096107107 నెంబర్ కి కాల్ చేస్తే నా వ్యక్తిగత సహాయక సిబ్బంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహాయక చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు.
					