- ముద్ర లోను పేరుతో బురిడీ – సైబర్ క్రైమ్ ఉచ్చులో యువకుడు
- 20 లక్షల లోను పేరుతో సైబర్ క్రైమ్, 2,28,500 రూ. లు లాగిన నేరస్తులు
- కేసు నమోదు చేసిన పోలీసులు
ఆత్మకూరు, అక్టోబర్ 27 (ప్రజాజ్యోతి):
ముద్ర లోను మంజూరి అయ్యిందని సైబర్ నేరగాళ్ళు ఓ యువకున్ని నమ్మించి మోసం చేశారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి గ్రామానికి చెందిన దుడ్డు శ్రీనివాస్ కు ముద్ర ఫైనాన్స్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. 20 లక్షలు లోను మంజూరి అయ్యింది, ఒక బ్లాంక్ చెక్ ఫోటో పెడితే లోను అమౌంట్ అకౌంట్ అకౌంట్ కి పంపిస్తామంటూ సైబర్ నేరాగాల్లు నమ్మించారు. ముందుగా 14 శాతం అమౌంట్ 2,80,000/- అడ్వాన్స్ నగదు చెల్లిస్తే లోన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇది నమ్మిన శ్రీనివాస్ తన స్నేహితులకు చెందిన వివిధ అకౌంట్స్ నుండి 2,28,500/- పంపించాడు. ఆ తరువాత మళ్ళీ ఒక కొత్త వ్యక్తి ఫోన్ చేసి ముద్ర మేనేజర్ మాట్లాడుతున్నట్టు చెప్పటంతో శ్రీనివాస్ కు అనుమానం వచ్చింది. వెంటనే సైబర్ క్రైమ్ నెంబర్ 1930 లో ఫిర్యాదు చేసి ఆన్లైన్ లో కేసు నమోదు చేయించాడు. తిరిగి ఆత్మకూరు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


