యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
— ఎస్సై భువనేశ్వర్
రామారెడ్డి అక్టోబర్ 23 (ప్రజా జ్యోతి)
అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా రామారెడ్డి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థినిలకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత పెడదారి పడకుండా, సమాజంలో సత్ప్రవర్తనతో, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని,డ్రగ్స్ కు కట్టడి ఏ విధంగా చేయాలో డ్రగ్స్ వల్ల యువత ఎలా చెడిపోతున్నారు.డ్రగ్స్ ను నిర్మూలించడానికి తగిన చర్యల గురించి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామారెడ్డి బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు మాధవ్,అధ్యాపక బృందం, రామారెడ్డి ఎస్ఐ భువనేశ్వర్, పోలీస్ సిబ్బంది. పాల్గొనడం జరిగింది. వ్యాసరచన పోటీలో భాగంగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది.