హైదరాబాద్ శివారు ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా, పోచారం పరిధిలో ఒక వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో సోను సింగ్ (ప్రశాంత్ సింగ్) అనే వ్యక్తి గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ప్రశాంత్ సింగ్ అని పోలీసులు గుర్తించారు. అతని గోరక్షక్‌గా తెలుస్తోంది.
ఇబ్రహీం అనే వ్యక్తితో ప్రశాంత్ సింగ్‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో ఇబ్రహీం తన వద్ద ఉన్న షార్ట్ గన్‌తో ప్రశాంత్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. ప్రశాంత్ గాయపడటంతో చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
కాల్పులు జరిపిన అనంతరం ఇబ్రహీం పరారీలో ఉన్నాడు. పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.