వైద్యనాథ్ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 21(ప్రజా జ్యోతి)
కామారెడ్డి పట్టణంలోని శ్రీ వైద్యనాథ్ ఆలయంలో మంగళవారం అమావాస్య,కార్తీక పౌర్ణమి ప్రారంభం సందర్భంగా ఆలయ కమిటీ వారు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, తదుపరి ప్రసాదాలను అందజేసి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.వారు మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ యొక్క వైద్యనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.