- పోతే మూడు వేలు.. లక్కు తగిలితే 40 లక్షలు
- ప్లాటు అమ్మకానికి కొత్త ఆలోచన
- లక్కీ డ్రా లో పాల్గొనండి అదృష్టాన్ని పరీక్షించుకోండి
పరకాల / ప్రజాజ్యోతి::
ఓ ప్లాట్ యజమాని తన ప్లాట్ అమ్మకానికి పెడితే ఎవ్వరు ముందుకు రాకపోవటంతో కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. వివరాల్లోకి వెళితే.. పరకాల మున్సిపాలిటీ పరిధిలో అంబాల రోడ్డు రాజీపేట శివాజీ సర్కిల్ దగ్గర మెయిన్ రోడ్డు బిట్టు 205 చ.గ.ల ప్లాట్ లక్కీ డ్రా టోకెన్ పద్దతిలో అమ్మకానికి పెట్టాడు. ఒక్కో టోకెన్ 2999/-₹ లు 1600 టోకెన్స్ వేసే అవకాశం కల్పించాడు. టోకెన్ ప్రారంభం 18 అక్టోబర్ నుండి ప్రారంభించి, 16 జనవరి 2026 రోజున డ్రా తీయనున్నారు. రెండవ బహుమతి గా ఐ ఫోన్ 16, ఇతర బహుమతులు కూడా అందించనున్నారు. 50 LED టీవీలు (40 ఇంచులు ), 50 సౌండ్ బార్, 50 ఎయిర్ పాడ్స్ అందిస్తూ జనాలను ఆకర్షస్తున్నారు.
ఇదిలా ఉంటే డ్రాలో పాల్గొనేందుకు జనాలు పెద్ద మొత్తంలో ముందుకు వస్తున్నారు.
