- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి
- బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
నల్లబెల్లి/అక్టోబర్ 18 (ప్రజా జ్యోతి):
బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ నల్లబెల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు.నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, పాక్స్ చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్ మాట్లాడుతూ.బీసీలకు రాజకీయ, ఉద్యోగ, విద్య రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు.కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు బీసీలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని, వీరి వల్లే రిజర్వేషన్ల అమలు ఆగిపోయిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు కోరారు.రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు నల్లబెల్లి మండలంలో బంద్ నిర్వహించి, షాపులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, పెట్రోల్‌బంకులు, కార్యాలయాలు మూసివేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాలెపు రాజేశ్వర్‌రావు, కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, ఇంగ్లీ శివాజీ, మామిళ్ల మోహన్‌రెడ్డి, నానబోయిన రాజారాం యాదవ్‌తో పాటు గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.