- గర్భినులు పౌష్టికహారం స్వీకరించాలి
- పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
ఆత్మకూరు, అక్టోబర్ 15 (ప్రజాజ్యోతి):
గర్భినులు పౌష్టికహారం స్వీకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరకాల సిడిపిఓ కె. స్వాతి ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం ఆత్మకూరులో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. ప్రతి మహిళకు సమాజంలో చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ఐసిడిఎస్ లబ్ధిదారులైన గర్భిణీ స్త్రీల పోషణ స్థితిని మెరుగుపరిచినట్లయితే మన భావితరాల పిల్లలు ఆరోగ్యంగా జన్మనివ్వడం జరుగుతుంది. భావితరాలు పోషణ లోపం లేకుండా ఆరోగ్యవంతమైన తెలంగాణ ఏర్పడుతుందన్నారు. ఒక కుటుంబం, గ్రామం ఆరోగ్యంగా ముందుకు వెళ్లాలంటే కుటుంబంలో మహిళల పాత్ర ప్రత్యేకమని కొనియాడారు. పోషణ మాసంలో భాగంగా ఏర్పాటుచేసిన కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ గర్భిణీలకు సామూహిక సీమంతాలు, ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు అన్నప్రాసనలు అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్యకి నమోదైన పిల్లలకు అక్షరాభ్యాసంలో పాల్గొని శుభాకాంక్షలు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి, తాహసిల్దార్ జగన్ మోహన్ రెడ్డి. మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి , మెడికల్ ఆఫీసర్ స్పందన, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ ఉమా, సునీత, పద్మావతి, పుణ్యవతి, నజీమా పర్వీన్, శ్రీదేవి రోజా రాణి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బిక్షపతి అంగన్వాడీ టీచర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు.