* ఏఐసీసీ పరిశీలకుడు జిల్లా అబ్జర్వర్ రాజ్ పాల్ కరోల
ఎల్లారెడ్డి,ప్రజాజ్యోతి:
క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయల మేరకే జిల్లా అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని, పార్టీ అభివృద్ధికి క్రియాశీలకంగా పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐసిసి పరిశీలకుడు జిల్లా అబ్జర్వర్ రాజ్ పాల్ కరోల అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్నేహ బంక్పేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎన్నికపై అభిప్రాయ సేకరణ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ మండల నాయకులు హాజరయ్యారు. వారందరి నుంచి వ్యక్తిగతంగా లిఖితపూర్వకంగా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక విలువలకు పార్టీ పెద్దపీట వేస్తోందన్నారు. అందుకే జిల్లాలో పార్టీని నడిపించే నాయకుడి ఎన్నిక కోసం కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే వారిని ప్రజాపాలన భాగస్వాములై సమన్వయకర్తగా పనిచేయగలిగే వారిని ఎన్నుకునే పద్ధతితో కాంగ్రెస్ పద్ధతికి శ్రీకారం చుట్టిందని అన్నారు. కార్యకర్తల అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత ఆ నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖగ్రే, సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఇతర ముఖ్య నేతలకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి పరమేష్, ఎల్లారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎల్లారెడ్డి,నాగిరెడ్డిపేట్, లింగంపేట్,గాంధారి, తాడ్వాయి సదాశివ నగర్ మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.