పుట్టింటికి వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి
భిక్కనూరు అక్టోబర్ 6 (ప్రజాజ్యోతి)
భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామానికి చాలా సంవత్సరాల తర్వాత కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య తన తల్లి గారి ఇంటికి రావడం జరిగింది.తన ఇంటి చుట్టుపక్కల వారందరినీ కలిసి గ్రామ విశేషాలు అడిగి తెలుసుకున్నారు.తదనంతరం ముత్యాలమ్మ గుడిని దర్శించుకుని,గ్రామ చెరువు ప్రాంతాన్ని పరిశీలించి మొన్న అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బిజెపి శాఖ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు శాలువాతో ఆమెను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అత్తిలి తిరుమలేష్, అధ్యక్షులు కుమ్మరి నరేందర్, కార్యవర్గ సభ్యులు ప్రమీల, పావని ,బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
