- తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు
పర్వతగిరి, అక్టోబర్ 05 (ప్రజాజ్యోతి):
పర్వతగిరి మండల కేంద్రం అల్లూరి కాలని మార్కెట్ యార్డ్ రోడ్డు మంచి నీటి ట్యాంకు పక్కనే ఉన్న చెనమల్ల నర్సయ్య ఇంట్లో దొంగతనం జరిగింది. నర్సయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి పండక్కి బంధువుల ఇంటికి వెళ్ళాడు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి గుర్తు తెలియని దుండగులు తాలాన్ని కోసి ఇంట్లో బిడ్డ కాలేజీ ఫీజు కోసం దాచిన 50 వేల నగదు, తులంన్నర బంగారు కమ్మలు, బుట్టలు, చైను, రింగు, వెండి పట్ట గొలుసులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు రోధిస్తూ తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.