కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం..
కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 03. (ప్రజాజ్యోతి)
కామారెడ్డి పట్టణంలో గురువారం అర్ధరాత్రి కత్తిపో
ట్లు కలకలం రేపాయి. పది రోజుల పాటు ప్రశాంతంగా సాగిన నవరాత్రి ఉత్సవాలు కత్తిపోట్లతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీశాయి.కామారెడ్డి పట్టణ సెంటర్ పాయింట్ అయిన పాత బస్టాండ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పాత బస్టాండ్ ప్రాంతంలో దుర్గానవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారికి ఉద్వాసన పలికిన అనంతరం పలు చోట్ల దాండియా ఆడారు. దాండియా వద్ద రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు గ్రూపులకు చెందిన యువకులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. కొందరు యువకులు వెంట తెచ్చుకున్న కత్తులతో దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత చేసుకుంది.
ఆస్పత్రికి తరలించిన పోలీసులు
దాడిలో ఐదుగురు యువకులకు మెడ, పొట్ట, వీపు భాగాలలో గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులను రాహుల్, మణిరాజు, మణికంఠం, కిరణ్, బాలాజీలుగా గుర్తించారు. జీజీహెచ్ ఎదుట మళ్లీ రెండు గ్రూపుల మధ్య గొడవ జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.