సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి):సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ రెండవ లైన్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల 17వ వార్షికోత్సవం సందర్భంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.గత 17 సంవత్సరాలుగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ ఉత్సవాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నిమ్మల వెంకన్న,మానన్ స్వర్ణసింగ్,గంజి సంతోష్ కుమార్,గోరుగంటి దామోదర్ రావు,బెక్కం వెంకటేశ్వరరావు,వంగవీటి మధుసూదన్,పత్తేపురం లింగయ్య,హేమలత,సునీత, కళమ్మ,లక్ష్మి,జానకి,రేణుక,పద్మ,వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.