- బతుకమ్మ పండుగ రోజున ఆడబిడ్డలకు యూరియా బస్తాలు
- హనుమకొండ జిల్లాలో వినూత్న రీతిలో బతుకమ్మ సంబరాలు
ఆత్మకూరు, సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి):
బతుకమ్మ పండుగ రోజున ఆడబిడ్డలకు యూరియా బస్తాలు ఇచ్చి వినూత్న రీతిలో మహిళలు సద్దుల బతుకమ్మ పండుగ ఆడుకున్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామంలో పండుగకు ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకు యూరియా బస్తాలు ఇచ్చి రైతులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో మహిళా రైతులు పడుతున్న ఇబ్బందులను తెలియపరుస్తూ.. బతుకమ్మ పండుగ జరుపుకున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రైతులు ఎంతో ఆనందంతో ఎరువు కొరత లేకుండా విత్తనాల కొరత లేకుండా ఎంతో ఆనందంతో పంటలు పండించుకున్నామంటూ వారు గోడు వెలుబుచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రైతుల కలలో ఆనందం కరువైంది కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ యూరియా అందించకుండా రైతులకు ఇబ్బందికి గురిచేస్తుందని మహిళలు వాపోయారు. బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మోర మహేందర్, ఐదో వార్డ్ మెంబర్ గుర్రం వేణు, ఉపసర్పంచ్ స్వప్న రాజ్ కుమార్, యూత్ నాయకులు మోర్ అరవిందు, మరిగితే శ్రీనివాస్, ఆధారసాని రాజకుమార్, మోర్ రాజు, గురు నాగేష్, పూజారి మనోహర్, కొక్కరకొండ రవి, కొక్కారకొండ పోశాలు, యాదవ్ కుమార్, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

