గరిడేపల్లి, సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి):ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.గత రెండు,మూడు సంవత్సరాలుగా గ్రామాల్లో సర్పంచ్ లేకపోవడంతో పాలన కుంటుపట్టిం ది.దీంతోం సమాజం పట్ల అవగాహన కలిగిన కొంతమంది అభ్యర్థులు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని కళ్లలో వత్తులేసుకొని మరి చూశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు గాను జిఓ తీసుకొచ్చినప్పుడు సంతోషించిన ఆశావహుల కాస్తా ఆయా జిఓ మీద కొంతమంది వ్యక్తులు హైకోర్టు కి వెళ్లడంతో కోర్టు సైతం ఎన్నికలు అక్టోబర్ 6 వరకు ఆపాలని అనడంతో తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేడు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో ఉండే ఆశావహులు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల ప్రచారం ప్రారంభించి ప్రజలను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో వరాలు కురిపిస్తున్నారు.